: వైజాగ్ లో హాట్ టాపిక్ గా మారిన 29 లక్షల రూపాయల బైక్


 వైజాగ్ లో 29 లక్షల ఖరీదైన బైక్ హాట్ టాపిక్ గా మారింది. హార్లీ డెవిడ్ సన్ కు చెందిన బైక్ ను ఇండస్ట్రియల్ ప్రాంతానికి చెందిన సత్యకుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఖతార్ నుంచి దీనిని దిగుమతి చేసుకున్నారు. 29 లక్షల ఖరీదైన ఈ బైక్ 1400 సీసీ సామర్థ్యం కలిగింది. లీటర్ పెట్రోల్ కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిని రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్, రోడ్డు ట్యాక్స్ నిమిత్తం 3.2 లక్షలు చెల్లించారు. రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కోసం మరో 2 లక్షల రూపాయలు చెల్లించారు. వైజాగ్ రోడ్ల మీద ఈ బైక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News