: మధ్యవర్తి ప్రాణం తీసిన నంద్యాల ఉపఎన్నిక బెట్టింగ్!


నంద్యాల ఉప ఎన్నిక బెట్టింగ్‌ మధ్యవర్తి ప్రాణం తీసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మహాదేవపట్నం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని శివ, వైఎస్సార్సీపీ అభిమాని గోలి శ్రీనివాస్ తో పందెం కాశాడు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ 16 వేలకుపైగా మెజారిటీతో విజయం సాధిస్తుందని శివ, మెజారిటీ రాదని శ్రీనివాస్ 5,000 రూపాయలు పందెం కాసుకున్నారు. అప్పటికప్పుడు తన జేబులోని 3,000 రూపాయలను శ్రీనివాస్, శివకు ఇచ్చాడు. అక్కడే ఉన్న గంటా సూర్యనారాయణ (55) ను మధ్యవర్తిగా పెట్టుకున్నారు.

ఇందులో ఏం జరిగినా నీదే బాధ్యత అని వారిద్దరూ చెప్పి వెళ్లిపోయారు. నంద్యాల ఉపఎన్నికల్లో శివ చెప్పినట్టు టీడీపీ గెలిచింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో సూర్యనారాయణ కుమారుడు నాగ వెంకట సత్యనారాయణకు మధ్యలో ఎందుకు తలదూర్చావని తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస్ సోదరుడు గోలి వెంకట్‌, అతడి తండ్రి దుర్గారావు, మరికొందరు వారి వాగ్వాదంలో జోక్యం చేసుకున్నారు. అది తీవ్రం కావడంతో వెంకట్ అక్కడే ఉన్న ఇనుపరాడ్డుతో గంటా సూర్యనారాయణ తలపై కొట్టాడు. దీంతో రక్తపుమడుగులో స్పృహతప్పి పడిపోయిన సూర్యనారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • Loading...

More Telugu News