: శ్రీలంక-భారత్ టీ20 మ్యాచ్.. ఆలస్యం కానున్న ‘టాస్’!


వర్షం కారణంగా శ్రీలంక-భారత జట్ల మధ్య టీ20 మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఫీల్డ్ బాగా తడిసిపోయింది. వర్షం పడటం ఆగడంతో మైదానాన్ని సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పిచ్ ను అంపైర్లు పరిశీలించిన అనంతరం టాస్ వేసేందుకు కొంత సమయం పట్టనుంది. కాగా, కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను కైవసం చేసుకునేందుకు రెండు జట్లు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్, వన్డే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు, టీ20ను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో, టెస్టు, వన్డే సిరీస్ లను చేజార్చుకుని సొంతగడ్డపై పరాభవం పాలైన శ్రీలంక జట్టు, ఈ మ్యాచ్ ను కైవసం చేసుకుని తమ అభిమానులకు కానుకగా ఇవ్వాలని చూస్తోంది.  
 

  • Loading...

More Telugu News