: వరసగా 20 మంది విద్యార్థుల చెంపలు ఛెళ్లుమనిపించిన ఉపాధ్యాయుడు!
పాఠశాలలోని తరగతి గదిలో 20 మంది విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు చేయిచేసుకున్న ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చైనాలోని అన్‌హూయ్‌లోని ఓ పాఠశాలలో హెఫై అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఓ హోం వర్క్ ఇచ్చాడు. అయితే, ఒక్కరు కూడా హోంవర్క్ సరిగా చేయలేదన్న కోపంతో, ఒక్కొక్కరినీ పిలిచి అందరి చెంపలు ఛెళ్లుమనిపించాడు. ఆ సమయంలో ఓ విద్యార్థి తన స్మార్ట్‌ఫోన్‌లో ఈ దృశ్యాలను రికార్డు చేశాడు. అనంతరం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. సదరు ఉపాధ్యాయుడిని పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.