: ఉత్తర కొరియా ప్రభావం.. బేర్ మన్న సెన్సెక్స్.. పతనమైన రూపాయి విలువ


ఉత్తర కొరియా చేపడుతున్న వరుస క్షిపణి, అణు పరీక్షల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై పడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై కూడా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్లు కోల్పోయి 31,662కు పడిపోయింది. నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 9,916కు చేరుకుంది.

మరోవైపు అమెరికన్ డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ. 64.26కు  పడిపోయింది. ఆగస్టు 16 తర్వాత రూపాయి విలువ ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఫ్యూచర్ కన్య్జూమర్ లిమిటెడ్ (10.49%), ఏజిస్ లాజిస్టిక్స్ (8.87%), ముత్తూట్ ఫైనాన్స్ (8.28%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (5.62%), యూనిటెక్ లిమిటెడ్ (4.99%).

టాప్ లూజర్స్...
రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (-4.26%), సన్ ఫార్మా (-3.73%), ఐడియా సెల్యులార్ (-3.42%), దివీస్ ల్యాబ్ (-3.29%), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (-3.27%).           

  • Loading...

More Telugu News