: గతేడాది రోడ్డు ప్రమాదాల వల్ల గంటకు 17 మంది చనిపోయారు... నివేదికలో వెల్లడి
గతేడాది జరిగిన 55 రోడ్డు ప్రమాదాల్లో సరాసరిన గంటకు 17 మంది మృత్యువాత పడ్డారని బుధవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. మృత్యువాత పడిన వారిలో సగానికి పైగా 18-35 ఏళ్ల వయసు వారే ఉన్నారని నివేదిక తేల్చి చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో 4.1 శాతం తగ్గుదల కనిపించినా, చనిపోయిన వారి సంఖ్యలో మాత్రం 3.2 శాతం పెరుగుదల వచ్చిందని నివేదిక తెలిపింది.
`ద యాక్సిడెంట్స్ ఇండియా 2016` పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక గతేడాది 4,80,652 రోడ్డు ప్రమాదాల్లో 1,50,786 మంది చనిపోగా, 4,94,624 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ ప్రమాదాల్లో 84 శాతం ఘటనలు డ్రైవర్ తప్పిదం వల్లే జరిగాయని నివేదిక తేల్చిచెప్పింది. అలాగే 86 శాతం రోడ్డుప్రమాదాలు 13 రాష్ట్రాల్లో నమోదయ్యాయని తెలియజేసింది. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఆంద్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్రల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు సంభవించినట్లు వివరించింది.