: గణనాథుడి జన్మస్థలం ఎక్కడుందో తెలుసా?


హిందువులు ఏ ప‌ని మొద‌లుపెట్టాలన్నా తొలిపూజ‌లు చేసేది విఘ్నేశ్వ‌రుడికే. అయితే, ఆయ‌న‌ జ‌న్మ‌స్థ‌లం గురించి మాత్రం అంత‌గా ఎవ్వ‌రికీ తెలియ‌దు. గ‌ణ‌నాథుడు ఉత్తరాఖండ్‌లోని డోడితాల్ ప్రాంతంలో జ‌న్మించాడని అక్క‌డివాసుల విశ్వాసం. అలాగే శివపార్వతులు ఆ రాష్ట్రంలోని త్రియుగినారాయణ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని స్థల పురాణాలు చెబుతాయి. అక్క‌డి మున్‌కటియా అనే ప్రాంతంలోనే వినాయ‌కుడిపై ఆగ్ర‌హం తెచ్చుకున్న శివుడు ఆయ‌న‌ తల నరికాడు.

అందుకే కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ముందుగా మున్‌క‌టియాలోని గ‌ణేశుడిని ద‌ర్శించుకుంటారు. కాగా, పార్వతీ దేవి వినాయకుడికి రూపమిచ్చిన ప్రాంతం ఉత్తరకాశీ జిల్లాలోని రుద్ర ప్ర‌యాగ్‌కి స‌మీపంలోని కైలాశు ప్రాంతంలో గల డోడితాల్ అని చెబుతుంటారు. అక్క‌డి ప్రజలు ఇక్కడ గ‌ణేశుడిని డోడీ రాజుగా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. దీంతో ఈ ప్రాంతాన్ని కేవలం వేసవిలో మాత్రమే చేరుకోగలం.  

  • Loading...

More Telugu News