: ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నండి.. లేక‌పోతే రోబోల‌ను ఉప‌యోగించుకోవాల్సి వ‌స్తుంది: ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు


రోబోల మీద ఆధార‌ప‌డే అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచించారు. చ‌దువుకున్న వాళ్లంద‌రూ ఈ మ‌ధ్య పిల్లల్ని క‌నడానికి భ‌య‌పడుతున్నార‌ని, అలా చేస్తే జ‌పాన్ దేశం లాగే మ‌నం కూడా రోబోల మీద ఆధార‌ప‌డే రోజులు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు.

`ఒక‌ప్పుడు నేను కుటుంబ నియంత్ర‌ణ గురించి బాగా ప్ర‌చారం చేసేవాడిని. ఇప్పుడు మాత్రం పిల్ల‌ల్ని క‌నండి అని చెబుతున్నాను. గ‌త త‌రం వాళ్లు కూడా పిల్ల‌ల్ని క‌న‌డానికి భ‌య‌ప‌డి ఉంటే మ‌నం పుట్టేవాళ్ల‌మే కాదు` అని చంద్ర‌బాబు అన్నారు. `జ‌నాభాలో స‌మతౌల్య‌త ఉండాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ‌త కొర‌త ఉంటే చాలా న‌ష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది` అని ఆయ‌న అన్నారు.  

  • Loading...

More Telugu News