: కొత్త సచివాలయం ఎందుకు? కేసీఆర్ ది పిచ్చి తుగ్లక్ నిర్ణయం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సచివాలయాన్ని తరలించాలన్న కేసీఆర్ పిచ్చి తుగ్లక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్ దగ్గర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ, బైసన్ పోలో లో సచివాలయ నిర్మాణం సరికాదని, సికింద్రాబాద్ ప్రాంతంలో ఇప్పటికే చాలా ఎక్కువ రద్దీ ఉందని అన్నారు. అమరావతి కొత్త రాజధాని కాబట్టి అక్కడ సచివాలయం కట్టుకున్నారని.. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా వీహెచ్ ప్రశ్నించారు.