: కలత చెందాను... సీబీఐ విచారణ అక్కర్లేదు: మహిళా జర్నలిస్టు హత్యపై సీఎం సిద్ధరామయ్య


బెంగళూరులో సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ దారుణ హత్య తనను కలచి వేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆమె మృతికి కారణమైన వాళ్లను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. గౌరీ లంకేశ్ తో తనకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని, జర్నలిస్టుగా ఆమె రాణించిన తీరు పలువురికి ఆదర్శప్రాయమని అన్నారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా మృతిపై సీబీఐ విచారణ అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం ఉందని చెప్పిన సిద్ధరామయ్య, ఐజీ స్థాయి అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి వున్నామని అన్నారు. 

  • Loading...

More Telugu News