: 'నున్న'లో నిన్న మాయమైన అమ్మాయిలు హైదరాబాద్ లో ప్రత్యక్షం.. ఇంటికి చేర్చుతున్న పోలీసులు!


విజయవాడ శివారు ప్రాంతమైన నున్నలో నిన్న అదృశ్యమైన ముగ్గురు అమ్మాయిల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వీరు ముగ్గురినీ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని విజయవాడకు తీసుకెళ్తున్నారు. నిన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 9వ తరగతి చదువుతూ, స్కూలుకు వెళ్లి, తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, పోలీసులను ఆశ్రయించగా, ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి వద్ద ఉన్న సెల్ ఫోన్, వారిని పట్టిచ్చింది. వీరు ఎందుకు హైదరాబాద్ వెళ్లారన్న విషయాన్ని ప్రశ్నించి తెలుసుకుంటామని, ప్రస్తుతం వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చే పనిలో ఉన్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News