: లక్నో మెట్రో రైలు మొదలైన తొలి రోజే ఆటంకం.. మధ్యలోనే ఆగిపోయిన రైలు.. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు!


లక్నోలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన తొలి రోజే ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఈ ఉదయం సేవలు ప్రారంభమైన కాసేపటికే సాంకేతిక కారణాల వల్ల రైలు మధ్యలో ఆగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 500 మంది భయభ్రాంతులకు గురయ్యారు. రైలు ఎందుకు ఆగిపోయిందో తెలుసుకునేందుకు లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎల్ఎంఆర్‌సీ) అధికారులు తలలు బద్దలు కొట్టుకున్నారు. ఫలితంగా రైలు గంటకు పైగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం రైలు ఆగిపోయిన 20 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది.

కాగా, రైలు గంటకు పైగా ఆగిపోవడం, భరించలేని వేడి, రైలులో ఏసీ లేకపోవడం, నీళ్లు లేక ప్రయాణికులు అల్లాడిపోయారు. రైలు మధ్యలో ఆగిపోవడంతో తాము వెళ్లాల్సిన విమానం ఎక్కడ మిస్సవుతామోనని పలువురు ఆందోళన చెందారు. మెట్రో కారణంగా సమయం ఆదా అవుతుందనుకుంటే రిక్షా కన్నా ఘోరంగా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రెండో ట్రాక్‌లో రైళ్లు యథావిధిగా నడుస్తుండడంతో ప్రయాణికులు భయపడాల్సిన పనిలేదని, రైలు రాగానే అందులో పంపిస్తామని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News