: చిన్నమ్మతో రహస్యంగా భేటీ అయిన దినకరన్ భార్య.. పలు పేపర్లపై సంతకాలు తీసుకున్న అనురాధ
పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో అన్నాడీఎంకే తొలగింపు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ భార్య అనురాధ రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. అనురాధతో పాటు పలువురు బంధువులు నిన్న ఆమెతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా శశికళ నుంచి అనేక పేపర్లపై సంతకాలు కూడా తీసుకున్నారు. త్వరలో జరగనున్న అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు శశికళకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటే... కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఈ సంతకాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.