: భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.. ఆయా రూట్ల వైపునకు రాకండి: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
గణనాథుడి నిమజ్జనం జరుగుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి వినాయకుడి విగ్రహాలు తరలివస్తోన్న రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో వాహనదారులు రాకుండా ఉంటే మంచిదని సూచించారు. నగరంలోని ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో సూచిస్తూ ఓ మ్యాప్‌ను విడుదల చేశారు. అందులో ఎరుపు గుర్తులు ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆయా ప్రాంతాల గుండా కాకుండా ప్రత్నామ్యాయ మార్గాల్లో వాహనదారులు వెళ్లాలని పోలీసులు చెప్పారు.
మరోవైపు బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం ముగిసింది. ట్యాంక్ బండ్‌కు గణేశుడి విగ్రహాలు వచ్చే మార్గాల్లో పోలీసులతో పాటు వ్యాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. విద్యుత్ దీపాల వెలుగులు, గణపతి విగ్రహాలతో హుస్సేన్ సాగర్ అంతా కోలాహలంగా మారింది.మిని ట్యాంక్ బండ్ గా పేరుగాంచిన సరూర్ నగర్ చెరువు వద్ద గణేశుడి నిమజ్జన వేడుకలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. గణేశ్ నిమజ్జనాలు రేపు ఉదయం వరకు కొనసాగుతాయని చెప్పారు.