: విద్యార్థుల్లారా! మీ ప్రశ్నలకు ఉపాధ్యాయులు కోపగిస్తే నాకు మెయిల్స్ పంపండి: గోవా సీఎం


‘విద్యార్థుల్లారా! మీరు వేసే ప్రశ్నలకు ఉపాధ్యాయులు కోపగించుకుంటే నాకు మెయిల్స్ పంపండి’ అంటూ గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రశ్నించడం అనేది బాల్యం నుంచే అలవడాలని, వారిలో ఆలోచన రేకెత్తించేలా మనం వారికి శిక్షణ ఇవ్వాలని అన్నారు.

విద్యార్థులు వేసే ప్రశ్నలు ఒకోసారి సంక్లిష్టంగా ఉంటాయని, అయినప్పటికీ, ఆ ప్రశ్నలకు తగిన సమాధానం చెప్పేలా చూడాలని అన్నారు. విజ్ఞానం పొందే సామర్థ్యాన్ని కల్పించాలని, ఈ దిశగా మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా పారికర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News