: సల్మాన్ ఖాన్ `టైగర్ జిందా హై`లో విలన్‌గా సుదీప్?
2012లో విడుదలై విజయం సాధించిన సల్మాన్ ఖాన్ చిత్రం ‘ఏక్ థా టైగర్’ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ‘టైగర్ జిందా హై’ సినిమాలో ప్రతినాయక పాత్రలో `ఈగ` ఫేం సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో హీరోయిన్‌గా కత్రినా కైఫ్ నటిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రస్తుతం హీరోకి, విలన్‌కి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించడానికి సుదీప్ పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ జహీర్ పాత్రలో సుదీప్ కనిపించనున్నారట. ఈ చిత్రానికి విశాల్-శేఖర్ స్వరాలు అందిస్తుండగా, యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. డిసెంబరు 22న ఈ చిత్రం విడుదల కానుంది.