: కుదుటపడుతున్న శిఖర్ ధావన్ తల్లి ఆరోగ్యం... అందరికీ కృతజ్ఞతలు తెలిపిన క్రికెటర్
తన తల్లికి అనారోగ్యం కారణంగా శ్రీలంకతో జరిగిన చివరి వన్డేకు ఓపెనర్ శిఖర్ ధావన్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం కుదుటపడిందని, ఇంతకుముందు కంటే ఇప్పుడు తన పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కోసం ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొంటూ శిఖర్ ధావన్ ట్వీట్ చేశాడు. ట్వీట్‌తో పాటు తల్లితో దిగిన సెల్ఫీని కూడా శిఖర్ ధావన్ షేర్ చేశాడు.