: పాక్-శ్రీలంక జట్ల మధ్య తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్
తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను ఆడేందుకు శ్రీలంక జట్టు సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పాకిస్థాన్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ ను ఆడనుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్ సీ) ప్రకటన చేసింది. టెస్టు సిరీస్ లో ఒక టెస్ట్ మ్యాచ్ ను డే అండ్ నైట్ నిర్వహించనున్నారని పేర్కొంది. కాగా, పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ తో పాటు రెండు టీ 20 సిరీస్ లు కూడా జరగనున్నాయి. ఐదు వన్డేల సిరీస్ అబుదాబి, షార్జా, దుబాయ్ లలో జరగనున్నాయి. టీ20 సిరీస్ లో ఒక టీ 20 మాత్రం లాహోర్ లో నిర్వహించనున్నారు.