: కలలో హత్య చేస్తున్నాననుకున్నాడు.. తీరా చూస్తే భార్యను నిజంగానే చంపేశాడు!


అమెరికా ఎమ‌ర్జెన్సీ నెంబ‌ర్ 911కి అర్థ‌రాత్రి కాల్ వ‌చ్చింది. `నాకెందుకో నా భార్య‌ను నేనే చంపిన‌ట్లుగా అనిపిస్తోంది. మీరు ఇక్క‌డికి రాగ‌ల‌రా?` అంటూ అవ‌త‌లి వైపు వ్య‌క్తి అడిగాడు. వెంట‌నే పోలీసులు హుటాహుటిన అక్క‌డికి బ‌య‌ల్దేరారు. అక్క‌డ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న మ‌హిళ మృత‌దేహాన్ని చూసి షాక‌య్యారు. మృత‌దేహం ప‌క్క‌నే ఫోన్ చేసిన వ్య‌క్తి ఏడుస్తున్నాడు. పోలీసులు వెంట‌నే అత‌న్ని అరెస్టు చేసి విచారించారు. అత‌ని పేరు మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్‌. భార్య లారెన్‌తో క‌లిసి నార్త్ క‌రోలినాలో నివ‌సిస్తున్నాడు.

ద‌గ్గు స‌మ‌స్య కార‌ణంగా ముందు రోజు రాత్రి కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయానని, కొన్ని గంటల తర్వాత మెలకువ వచ్చి చూస్తే త‌న భార్య ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింద‌ని, ప‌క్క‌నే క‌త్తి కూడా ఉంద‌ని మాథ్యూ చెప్పాడు. అయితే నిద్ర పోయిన‌పుడు ఓ క‌ల వ‌చ్చింద‌ని అందులో త‌న భార్య‌ను తానే చంపినట్లుగా క‌నిపించింద‌ని, లేచి చూసేస‌రికి తాను చ‌నిపోయి ఉంద‌ని, కానీ ఈ హ‌త్య తాను చేయ‌లేద‌ని... ఇలా అర్థం ప‌ర్థం లేకుండా రకరకాలుగా మాట్లాడాడు. దీంతో టాబ్లెట్ డోస్ ఎక్కువ కావ‌డం వల్ల, తనకు తెలియకుండా కలలో అనుకుని నిజంగానే లారెన్‌ను హత్య చేసి ఉండొచ్చునని, ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేసిన‌పుడు కూడా ఇదే విష‌యం చెప్పాడ‌ని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News