: ట్రంప్‌ నా భార్య కాదు.. నేను ఆయన భర్తనీ కాను: రష్యా అధ్యక్షుడు పుతిన్‌


‘ట్రంప్‌ నా భార్య కాదు.. నేను ఆయన భర్తనీ కాను’ అని రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ర‌ష్యా మీడియా డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి పుతిన్‌ను ప్రశ్నించగా ఆయ‌న ఇలా స‌మాధానం ఇచ్చారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు ‘ట్రంప్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఎలా ఉంటుంది?’ అని మీడియా నుంచి ప్ర‌శ్న ఎదురైంది. దీనికి పుతిన్ స్పందిస్తూ .. అది చాలా తప్పని అన్నారు. అమెరికాతో అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం త‌మ దేశానికి చాలా ఉందని అన్నారు. ఇటీవ‌లే అమెరికాలోని రష్యా దౌత్య కార్యాలయాలను అగ్ర‌రాజ్యం ఖాళీ చేయించిన విష‌యం తెలిసిందే. ర‌ష్యా కూడా అదే ప‌నిచేస్తుండ‌డంతో ఇరు దేశాల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరిగాయి.   

  • Loading...

More Telugu News