: దేవుడు మాకు ఇచ్చిన వరం నిషా: సన్నీలియోన్


  నిషా తమకు దేవుడు ఇచ్చిన వరమని బాలీవుడ్‌ శృంగారం తార సన్నీలియోన్ తెలిపింది. ఈ మధ్యే సన్నీ లియోన్, డేనియల్‌ వెబర్‌ దంపతులు నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. నిషా తమ జీవితాల్లోకి ప్రవేశించిన తరువాత తమ జీవితమే మారిపోయిందని చెబుతోంది. నిషా రోజూ ఉదయాన్నే తనను నిద్ర లేపుతుందని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇంటి వాతావరణానికి అలవాటు పడుతోందని చెప్పింది.

తాను నిద్ర లేచిన దగ్గర్నుంచి నిషాకు ఏం కావాలో తాను చూసుకుంటానని చెప్పింది. నిషాతో ఆడుకోవడమన్నా, నిషాకు తినిపించడమన్నా తనకు చాలా ఇష్టమని చెప్పింది. నిషా వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని తెలిపింది. ఇంత వరకు తాను కోల్పోయిన దానిని నిషాకు ఇవ్వాలనుకుంటున్నానని సన్నీ తెలిపింది. నిషా తమను తల్లిదండ్రులుగా ఎంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది. నిషాను తమ జీవితాల్లోకి వచ్చేలా చేసిన దేవుడికి ధన్యవాదాలు తెలిపింది. 

  • Loading...

More Telugu News