: నేనెప్పుడూ ఒకే తప్పును రెండు సార్లు చేయను... 5,6 సార్లు చేస్తాను!: నెటిజన్లను ఆకట్టుకుంటున్న కత్రినా పోస్ట్
రణ్ బీర్ కపూర్ తో ప్రేమ విఫలమయ్యాక సోషల్ మీడియాలో ఖాతా ఓపెన్ చేసిన బాలీవుడ్ కథానాయిక కత్రినా కైఫ్ చాలా చురుగ్గా ఉంటోంది. తన సినిమా, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలను పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో కత్రిన పెట్టిన పోస్టు ఆమె అభిమానులను అలరిస్తూ, వైరల్ అవుతోంది.
‘నేనెప్పుడూ ఒక తప్పును రెండు సార్లు చేయను.. 5, 6 సార్లు చేస్తా. ఎందుకంటే అసలది నిజంగా తప్పేనా అని తెలుసుకోవడానికి’ అంటూ కత్రినా పేర్కొంది. దీనికి భారీ ఎత్తున లైకులు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో ‘టైగర్ జిందా హై’, ఆమిర్ ఖాన్ తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ సినిమాల్లో నటిస్తోంది. షారూఖ్ సినిమాలో కూడా ఆమెనే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకేసారి బాలీవుడ్ లో ఖాన్ త్రయంతో కత్రిన నటించడం విశేషం.