: 2018 డిసెంబర్ లేదా 2019 ప్రథమార్థంలో ఎన్నికలు జరగొచ్చన్న చంద్రబాబు


2018 డిసెంబర్  లేదా 2019 ప్రథమార్థంలో ఎన్నికలు జరగొచ్చని.. అన్నిస్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అమరావతిలో జరిగిన వర్క్ షాపులో టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. పబ్లిక్, పొలిటికల్, పోల్ మేనేజ్ మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ ప్రారంభించాలని సూచించారు. నాయకుడికి ప్రతి ఎన్నిక ఒక పాఠం లాంటిదని, తప్పొప్పులు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయం చూసి పొంగిపోవద్దని, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించ వద్దని ఈ సందర్భంగా నేతలకు సూచించారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీకి 56 శాతం పోలింగ్ నమోదైందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని 60 శాతానికి పెంచుకోవాలని అన్నారు. కాగా, పబ్లిక్ మేనేజ్ మెంట్, పొలిటికల్ మేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గంటన్నరపాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

  • Loading...

More Telugu News