: మ‌హేశ్ బాబు ‘స్పైడర్’ నుంచి మరో పాట విడుదల


మ‌హేశ్ బాబు హీరోగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తోన్న స్పైడ‌ర్ సినిమా నుంచి ఇటీవ‌లే బూం బూం బూం పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ సినిమాలోని 'హాలి.. హాలి' పాట‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాకి హేరిస్ జ‌య్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. స్పైడ‌ర్ లో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ‘హాలి హాలి పాట విడుదలైంది... ఎంజాయ్’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విభిన్న క‌థాంశంతో మురుగ‌దాస్ రూపొందిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై అంద‌రినీ ఆక‌ర్షించింది.
 

  • Loading...

More Telugu News