: గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయాలి: ఏపీసీసీ
దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాపై వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఏపీసీసీ ఈ రోజు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పేద, బడుగు, బలహీన వర్గాల నాయకుడయిన రంగాపై గౌతమ్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదని అందులో పేర్కొంది. అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఇది విజయవాడలో శాంతి, భద్రతల సమస్య అవుతుందని పేర్కొంది. గౌతమ్ రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.