: ‘బ్లూవేల్’ నిషేధంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించండి: మద్రాస్ హైకోర్టు ఆదేశాలు


పిల్లల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్న ‘బ్లూవేల్’ ఛాలెంజ్ గేమ్ ను నిషేధించేందుకు గల సాధ్యాసాధ్యాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ గేమ్ బారిన పడి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. మృత్యు క్రీడగా మారిన ‘బ్లూ వేల్’ నిషేధానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జస్టిస్ కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్ లతో కూడిన మధురై ధర్మాసనం ఆదేశించింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని, అందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ను ఈ  కేసులో ఇంప్లీడ్ కావాలని ధర్మాసనం ఆదేశించింది. ఆన్ లైమ్ గేమ్స్ నిషేధానికి ఐటీ శాఖ కూడా సూచనలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

  • Loading...

More Telugu News