: ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్ఠానికి చేరిన బంగారం ధ‌ర‌!


బంగారం ధ‌ర‌ ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్ఠానికి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో పాటు ఉత్త‌రకొరియా హైడ్రోజ‌న్ బాంబు ప‌రీక్ష జ‌రిపి మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డ‌డం వంటి ప‌రిస్థితులతో ఈ రోజు మ‌రో రూ.200 పెరిగి, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధ‌ర‌ రూ.30,600గా న‌మోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెర‌గ‌డంతో వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నిస్తూ రూ.200 పెరిగి కిలో వెండి రూ.41,700కి చేరింది. గ్లోబ‌ల్ మార్కెట్లో ప‌సిడి ధ‌ర రూ.0.71 శాతం పెరిగి ఔన్సు 1,333.80 డాలర్లుగా న‌మోదైంది. 

  • Loading...

More Telugu News