: తిరగబడిన 'జాతకం': ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోబోయిన వ్యక్తి... అడ్డుకున్న అధికారులు
తమిళనాడులోని విరుధ్‌నగర్ జిల్లాలో ఎం వెల్లయపురం గ్రామానికి చెందిన 31 ఏళ్ల రామమూర్తి ఒకేసారి ఇద్దరు యువతుల్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లిపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెళ్లి జరిగే సమయానికి అధికారులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అమ్మాయిల తల్లిదండ్రులను పిలిచి అధికారులు విచారించగా, రామమూర్తి జాతకం ప్రకారం అతనికి ఇద్దరు భార్యల యోగం ఉందని పంతులు చెబితే తమ కుమార్తెలు రేణుకాదేవి (21), గాయత్రి (20)లను ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధపడ్డామని తెలిపారు. అమ్మాయిలు ఇద్దరూ రామమూర్తికి మేనకోడళ్లు అవుతారు. అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కేవలం రేణుకాదేవితో మాత్రమే వివాహం జరిపించేందుకు అందరూ అంగీకరించారు.