: మంత్రి పదవి ఆశించలేదు.. రాలేదని నిరాశా లేదు, ఎన్నో సమీకరణాలు ఉంటాయి: ఎంపీ హరిబాబు


కేంద్రమంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం వస్తుందని ఆశించలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. వైజాగ్ లో ఆయన మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించాలన్నదే తన అభిమతమని అన్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు హాజరయ్యేందుకే కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లానని ఆయన అన్నారు. తనకు పార్టీ పెద్దల నుంచి పిలుపురావడం వల్ల వెళ్లలేదని ఆయన తెలిపారు.

చాలా సమీకరణాలు పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవి కేటాయిస్తారని ఆయన అన్నారు. అన్నీ అనుకూలిస్తే పదవులు వస్తాయి, లేకపోతే లేదని ఆయన చెప్పారు. కాగా, మంత్రి వర్గ విస్తరణ సందర్భంగా...ఏపీ నుంచి హరిబాబును కచ్చితంగా తీసుకుంటారని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News