: ఎన్డీయే ఇక చనిపోయినట్టే!: సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ


జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) దాదాపు చనిపోయినట్టేనని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మిత్రపక్షాలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదు. కేవలం బీజేపీ నేతలు, లేదా బీజేపీకి పనికొస్తారని భావించిన వారికి మాత్రమే పెద్దపీట వేశారు. 9 మంది బీజేపీ నేతలు కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి మిత్రపక్షం శివసేన గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలు, రాష్ట్రపతి ఎన్నికలు వంటి అవసరమైన సమయాల్లో మాత్రమే బీజేపీకి మిత్రపక్షాలు గుర్తుకొస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రస్తుతం పేపర్లకు మాత్రమే పరిమితమైందని ఆయన విమర్శించారు. 

  • Loading...

More Telugu News