: రూ. 5 నుంచి రూ. 399... వినియోగదారులకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్లు
రిలయన్స్ జియో తాకిడిని తట్టుకోవడానికి భారత దేశ నెం.1 టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 5 నుంచి రూ. 399 వరకు వివిధ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రూ. 5తో రీఛార్జీ చేస్తే ఏడు రోజుల పాటు 4జీ లేదా 3జీ ఇంటర్నెట్ వాడుకునే సదుపాయం కల్పించింది. అలాగే ప్రత్యేకించి వాయిస్ కాల్స్ కోసం కూడా కొన్ని రీఛార్జీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ. 8తో రీఛార్జీ చేసుకుంటే 56 రోజుల పాటు లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను నిమిషానికి 30 పైసలతో మాట్లాడుకునే సదుపాయం కల్పించింది. అలాగే వాయిస్, నెట్ వాడేవారికోసం రూ. 40, రూ. 60, రూ. 149, రూ. 199, రూ. 349 రీఛార్జీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్ జియో తరహాలో రూ. 399 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జీ ద్వారా జియో తరహాలోనే 84 రోజుల పాటు రోజుకి 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.