: ట్విట్టర్ లో నెటిజన్లను ఆకట్టుకుంటున్న పరిణీతి చోప్రా, హార్డిక్ పాండ్య 'ప్రేమ' సంభాషణ!


బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మధ్య జరిగిన ప్రేమ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా పరిణీతి చోప్రా తన ట్విటర్‌ ఖాతాలో ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్‌ ఫొటోను పోస్ట్‌ చేసింది. దానికి ‘అద్భుతమైన భాగస్వామితో కచ్చితమైన ప్రయాణం. ప్రేమ ఇప్పుడు గాలిలో తేలియాడుతోంది’ అంటూ పేర్కొంది. దీనికి స్పందించిన హార్దిక్‌ పాండ్య ‘పరిణీతి.. నేను ఊహించవచ్చా? నాకు తెలిసి ఇది బాలీవుడ్‌-క్రికెట్‌ లింక్‌ అయి ఉంటుంది. ఏదేమైనా మంచి ఫొటో’ అంటూ ట్వీట్‌ చేశాడు.

దానికి వెంటనే బదులిచ్చిన పరిణీతి ‘హార్దిక్‌.. హహహ. కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తానికి నేను చెప్పేది ఏమిటంటే ఆ ఫొటోలోనే క్లూ ఉంది’ అని పేర్కొంది. వారి ఈ సంభాషణతో పరిణీతి క్రికెటర్‌ తో ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీంతో తన ప్రేమ కథపై వస్తున్న పుకార్లకు ఒక వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ ఫోటోలో తాను పేర్కొన్న భాగస్వామి తన కొత్త సెల్‌ ఫోన్‌ అని చెప్పింది. ఆ ఫోన్ తో తీసిన ఫోటో అద్భుతంగా వచ్చిందన్న భావంతో పాటు ఆ ఫోన్ తనను ఆకట్టుకుందని చెప్పానని. దానిని ఎవరికి నచ్చినట్టు వారు అన్వయించుకున్నారని తెలిపింది. 

  • Loading...

More Telugu News