: ప‌వ‌న్ అభిమానుల‌ను అలాగే వ‌దిలేయాలా? లేక చ‌ర్యలు తీసుకోవాలా?... క‌త్తి మ‌హేశ్ ఫేస్‌బుక్ పోస్ట్‌


పవన్ కల్యాణ్ అభిమానులపై సినీ విమ‌ర్శ‌కుడు, బిగ్ బాస్ ఫేం క‌త్తి మ‌హేశ్ మళ్లీ విరుచుకుపడ్డారు. `నా ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే...సోష‌ల్ మీడియాలో నాకు మ‌ద్ద‌తిచ్చిన‌వారికి కూడా పిచ్చి అభిమానులు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. వాళ్ల‌కు కూడా హెచ్చ‌రిక‌లు, బూతు మెసేజ్‌లు వెళ్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల సంఘం ఇంకా వివాదాన్ని కొన‌సాగించాల‌నుకుంటోంది. నేను త‌గ్గినా వాళ్లు త‌గ్గ‌డం లేదు. ఇది ఇలాగే కొన‌సాగితే జ‌రిగే ప‌రిణామాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కొంత‌మంది అభిమానులు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. పిచ్చి అభిమానులు... వీళ్ల‌ను ఇలాగే వ‌దిలేయాలా? లేక ఏదైనా చ‌ర్య తీసుకోవాలా?... మీ ఇష్టం!` అంటూ క‌త్తి మ‌హేశ్ త‌న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

 ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌ను చేసిన వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తునిస్తూ కొంత‌మంది సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వారికి కూడా ప‌వ‌న్ అభిమానులు బెదిరింపు కాల్స్ చేస్తుండ‌టంపై మ‌హేశ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తీవ్రంగా స్పందించారు.

  • Loading...

More Telugu News