: నేడే ఆఖరి పోరాటం...శ్రీలంక భవిష్యత్ ను నిర్ణయించే కీలక మ్యాచ్ నేడు!


ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేడు చివరి వన్డే జరగనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ వన్డేలో కూడా విజయం సాధించి, సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, ఈ వన్డేలో నెగ్గడం ద్వారా పరువుతో పాటు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కూడా నిలబెట్టుకోవాలని శ్రీలంక భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ టీమిండియాకు మరీ అంత ప్రాముఖ్యత కలిగినది కానప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో విదేశీ గడ్డపై విదేశీ జట్టును టెస్టు, వన్డే సిరీస్ లలో క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని వదులుకునేందుకు టీమిండియా సిద్ధంగా లేదు. అదే సమయంలో పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరడం ద్వారా ప్రపంచ కప్ లో ఆడే అవకాశం కోల్పోయేందుకు శ్రీలంక కూడా సిద్ధంగా లేదు.

పాయింట్ల పట్టికలో వెస్టిండీతో శ్రీలంక పోటీ పడుతోంది. 2017 చివరి నాటికి శ్రీలంక రెండు విజయాలు సాధించడం ద్వారా వెస్టిండీస్ కంటే మెరుగైన పాయింట్లతో వరల్డ్ కప్ లో ఆడే అవకాశం పొందుతుంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి శ్రీలంకకు వెస్టిండీస్ తో సిరీస్ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే, విండీస్ తో సిరీస్ లో మరో మ్యాచ్ లో విజయం సాధించినా వరల్డ్ కప్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో విజయం సాధించడం శ్రీలంకకు అత్యంత అవసరం. లేని పక్షంలో ఇప్పటికే తీవ్ర విమర్శలపాలైన శ్రీలంక జట్టుపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించనున్నాయి. 

  • Loading...

More Telugu News