: నేను రాజీనామా చేయను.. కావాలంటే డిస్మిస్ చేసుకోండి!: ఉమా భారతి మొండిపట్టు


కేంద్రమంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ బీజేపీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ప్రధాని మోదీపై తొలిసారి మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎంపీ ధిక్కార స్వరం వినిపించగా తాజాగా జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి తాను రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. తానైతే రాజీనామా చేయబోనని, కావాలంటే తనను డిస్మిస్ చేసుకోవాలని ఉమ తెగేసి చెప్పినట్టు సమాచారం.

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కోసం పనితీరు సరిగా లేని 8 మంది మంత్రుల నుంచి అమిత్ షా రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. అందులో ఉమా భారతి కూడా ఉన్నారు. మోదీ మానస పుత్రిక అయిన నమామి గంగా పథకం అమల్లో ఉమ పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమెను రాజీనామా కోరినట్టు సమాచారం. అయితే తాను రాజీనామా చేసేది లేదని, తనను తొలగించాలనుకుంటే డిస్మిస్ చేయాలని అధిష్ఠానానికి ఉమ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమా భారతి విషయంలో ఏం చేయాలనే విషయంలో అధిష్ఠానం సందిగ్ధంలో పడింది.

  • Loading...

More Telugu News