: నా కోరిక నెరవేరుతోంది... దర్శకుడిగా తొలి సినిమా తీస్తున్నాను: నటుడు రాహుల్ రవీంద్రన్
తన చిరకాల కోరిక నెరవేరుతోందని, తాను దర్శకుడిగా తొలి సినిమా తీయబోతున్నానని నటుడు రాహుల్ రవీంద్రన్ అన్నాడు. ఈ సినిమాలో సుశాంత్ హీరో అని తెలిపాడు. మరోవైపు సుశాంత్ కూడా తన తదుపరి చిత్రంపై ట్వీట్ చేస్తూ తాను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నానని పేర్కొన్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ లవ్లీగా ఉందని అన్నాడు. తనకు అభిమానుల సపోర్ట్ కావాలని పేర్కొన్నాడు. ఈ ఇరువురికీ నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.