: పవన్ కల్యాణ్ గారూ.. హ్యాపీ బర్త్ డే: సీఎం చంద్రబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘పవన్ కల్యాణ్ గారూ.. హ్యాపీ బర్త్ డే. ప్రజా సంక్షేమం కోసం మీరు పాటుపడుతున్న తీరు ఎంతో ప్రశంసనీయం. ఇదే ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్లాలని నేను ఆశిస్తున్నా’ అని చంద్రబాబు తన ట్వీట్ లో కోరారు. కాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా పవన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని లోకేశ్ తన ట్వీట్ లో కోరారు.