: `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి`లో సంద‌డి చేసిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు


అమితాబ్ వ్యాఖ్యాత‌గా సోనీ టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న `కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి సీజ‌న్ 9`లో భారత మ‌హిళా క్రికెట్ బృందం సంద‌డి చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్‌, స్మృతీ మంధ‌న‌, పూనం రౌత్‌, వేద కృష్ట‌మూర్తి, జుల‌న్ గోస్వామి, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌, దీప్తి శ‌ర్మ‌ల‌తో పాటు జ‌ట్టు కోచ్ తుషార్ ఆరోథే కూడా కార్య‌క్ర‌మానికి విచ్చేశారు. ఇద్ద‌రిద్ద‌రు చొప్పున గేమ్ ఆడి మొత్తంగా రూ. 6.4 ల‌క్ష‌లు గెల్చుకున్నారు. వీరు గెల్చుకున్న ఈ మొత్తాన్ని హైద‌రాబాద్‌లోని ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌కు అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కార్యక్ర‌మంలో భాగంగా కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను, ప్ర‌పంచ క‌ప్ స‌మ‌యంలోని విష‌యాల‌ను వారు పంచుకున్నారు. స్మృతీ మంధ‌న‌కు ఇష్ట‌మైన గాయ‌కుడు అరిజీత్ సింగ్‌ను కూడా అమితాబ్ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించారు. ప్ర‌త్యేకంగా స్మృతీ కోసం అరిజీత్‌తో ఓ పాట కూడా పాడించారు.

  • Loading...

More Telugu News