: ‘అర్జున్ రెడ్డి’ని ఎంతో నేర్పుగా తెరకెక్కించారంటూ రకుల్ ప్రశంసలు


‘అర్జున్ రెడ్డి’ సినిమాపై సినీ ప్రముఖుల ప్రశంసల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, సినీ నటులు నాని, రానా, సుమంత్, సమంత ఇప్పటికే ఈ సినిమా యూనిట్ పై, ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ నటనపై ప్రశంసలు కురిపించారు. తాజాగా, అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఆ జాబితాలో చేరింది. ‘‘అర్జున్ రెడ్డి’ని ఎంత నేర్పుగా తీశారు! విజయ్ దేవర కొండ ఎంత బాగా నటించాడు...ఈ సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించిన యావత్తు చిత్ర బృందానికి అభినందనలు’ అని రకుల్ ప్రశంసించింది.

  • Loading...

More Telugu News