: రూ. కోటి `అల్లా` మేకను ఎవ్వరూ కొనలేదు... వట్టిచేతుల్తో వెనుదిరిగిన యజమాని!
బక్రీద్ సందర్భంగా ముంబైలోని డియోనర్ వధశాలకు తీసుకొచ్చిన రూ. కోటి విలువ గల `అల్లా` మేకను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దాని యజమాని వట్టిచేతుల్తో వెనుదిరిగి వెళ్లిపోయాడు. వర్షాల కారణంగా మార్కెట్ మీద తీవ్ర ప్రభావం పడిందని, అందుకే అంత పెద్ద మొత్తం వెచ్చించడానికి ఎవరూ ముందుకు రాలేదని, వచ్చే ఏడాది మళ్లీ మేకను మార్కెట్‌కు తీసుకువస్తానని యజమాని కపిల్ సొహైల్ తెలిపాడు. ప్రతి ఒక్కరూ దాన్ని చూడటానికి వస్తున్నారే తప్ప ఎవరూ కొనడం లేదని అతడు చెప్పాడు.
మేక మెడ భాగంలో అరబ్ లో 'అల్లా` చిహ్నాన్ని పోలిన గుర్తులు ఉన్నాయి. దీంతో వారు ఆ మేక ధరను కోటి ఏడువందల ఎనభై ఆరు రూపాయలుగా నిర్ణయించారు. అయితే, అంత ధరకు మేకను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ధరను సగానికి తగ్గించారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో మేకతో పాటు తాము వెనుదిరిగామని తెలియజేశాడు.