: మలింగ ఇంట్లో పార్టీ చేసుకున్న టీమిండియా క్రికెటర్లు
శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను స్వీప్ చేసిన కోహ్లీ సేన... చివరి వన్డేలో కూడా గెలుపొంది వన్డే సిరీస్ ను స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. అయితే, ఆట వేరు, ఇతర ఆటగాళ్లతో ఉన్న అనుబంధాలు వేరు. తాజాగా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మలింగ్ ఇంట్లో టీమిండియా ప్లేయర్లు పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి పలువురు శ్రీలంక ప్లేయర్లు కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ధావన్, రోహిత్ శర్మలు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. శ్రీలంక ఆటగాళ్లతో కలసి మలింగ ఇంట్లో బాగా ఎంజాయ్ చేశామంటూ ధావన్ పోస్ట్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు మలింగ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మలింగకు భారత ఆటగాళ్లతో ఎంతో సాన్నిహిత్యం ఉంది.