: జగన్ కు తొత్తుగా మారిన ముద్రగడకు మంచి గుణపాఠం చెప్పారు: టీడీపీ నాయకుడు గోపిశెట్టి
వైసీపీ అధినేత జగన్ కు తొత్తుగా మారిన ముద్రగడ పద్మనాభంకు కాకినాడ ఓటర్లు మంచి గుణపాఠం చెప్పారని కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు గోపిశెట్టి నాగరాజు అన్నారు. పాదయాత్ర పేరిట ముద్రగడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా పాదయాత్ర చేయాలనుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని ప్రశ్నించారు. ఆయన చేస్తున్న కుట్రలు పసిగట్టిన కాకినాడ ఓటర్లు తమ ఓటు ద్వారా కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి, ముద్రగడకు మంచి గుణపాఠం చెప్పారని విమర్శించారు. కాగా, కాపు, బలిజలను బీసీల్లో చేర్చే నిమిత్తం వేసిన మంజునాథ కమిషన్ నివేదిక త్వరలోనే విడుదల కానుందని చెప్పారు.