: మొక్కజొన్న పంటలపై పడి దోచుకు తినండి.. యుద్ధానికి సన్నద్ధం కండి.. సైనికులకు స్వేచ్ఛనిచ్చిన ఉత్తరకొరియా!


అమెరికా-ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ సైనికులకు ఉత్తర కొరియా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తుండడంతో దాని నుంచి బయటపడి యుద్ధం కోసం సన్నద్ధం కావడానికి సైనికులకు స్వేచ్ఛ కల్పిస్తూ మిలటరీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కనిపించే మొక్కజొన్న పొలాలపై పడి దొంగిలించి కావాల్సినన్ని తినొచ్చని, ఈ విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం అణ్వస్త్ర పరీక్షలపై పెట్టిన దృష్టి సైనికులకు అందించే ఆహారం విషయంలో పెట్టకపోవడంతో సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాపై కత్తులు దూస్తున్న కిమ్ ఏ క్షణాన్నైనా యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇదే సమయంలో సైనికులు పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయం బయటపడింది. ఇలా అయితే యుద్ధం కష్టమని భావించిన కిమ్ యుద్ధం నాటికి సైనికులను పూర్తి సన్నద్ధంగా తయారుచేసే ఉద్దేశంతో తాజా ఆదేశాలు జారీ చేయడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News