: ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆకాశానికెత్తేసిన హీరో మహేశ్ బాబు.. పొగుడుతూ వరుస ట్వీట్లు!
వివాదాల్లో ఇరుక్కుంటూ మరింత పబ్లిసిటీ తెచ్చుకుంటోన్న ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై హీరో మహేశ్ బాబు ఈ రోజు ట్వీట్లు చేశాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఆయన అన్నాడు. ఎంతో నేచురల్‌గా, ధైర్యంగా వినూత్నంగా అర్జున్ రెడ్డిని తీశారని, అన్ని సినిమాలూ వెళ్లే దారిలో కాకుండా కొత్తగా తీశారని వరుస ట్వీట్లు చేస్తూ మెచ్చుకున్నాడు.
విజయ్ దేవరకొండ నటన అద్భుతమని అన్నాడు. హీరోయిన్ షాలిని, సినిమాలోని ఆమె ఫ్రెండ్స్ పాత్రలు బ్రిలియంట్ గా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇక సందీప్ వంగా తీసింది మొదటి సినిమానేనా అనేలా ఉందని, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రీకరించాడని చెప్పాడు. మీకు, మీ టీమ్ కి కంగ్రాట్స్ సర్ అని ఆకాశానికెత్తేశాడు.