: కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన బండారు దత్తాత్రేయ


కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి తెలంగాణ బీజేపీ నేత బండారు ద‌త్తాత్రేయ రాజీనామా చేశారు. ఆదివారం ఉద‌యం కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేంద్ర మంత్రులు రాజీవ్ ప్ర‌తాప్ రూఢీ, ఉమాభార‌తి, రాధా మోహ‌న్ సింగ్, సంజీవ్ బ‌లియాన్‌, గిరిరాజ్ సింగ్ కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. మోదీ కేబినెట్‌లో అన్నాడీఎంకే, జేడీయూ నేత‌లు కూడా చేర‌నున్నారు. కేంద్ర మంత్రుల‌ ప‌ద‌వుల నుంచి తొల‌గించిన బీజేపీ నేత‌ల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అధిష్ఠానం భావిస్తోంది. ఇప్ప‌టికే ప‌లుసార్లు భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షాతో భేటీ అయిన విష‌యం తెలిసిందే.   

  • Loading...

More Telugu News