: 118 లైంగిక వేధింపుల కేసులను ఎదుర్కుంటున్న భారత సంతతి డాక్టర్!


ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 118 లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులున్న డాక్టర్ కు బెయిల్ మంజూరైంది. మనీష్ షా (47) అనే భారత మూలాలున్న వ్యక్తి లండన్ లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. 2004, 2013 మధ్య కాలంలో 54 మందిపై లైంగిక వేధింపులకు ఆయన పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆయన 118 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇందులో 13 ఏళ్లకంటే తక్కువ వయసున్న బాలికపై కూడా లైంగిక దాడికి యత్నించినట్టు ఆయనపై కేసు నమోదైంది.

కేసు విచారణకు గాను ఆయన నిన్న బార్కింగ్ సైడ్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తనపై ఉన్న అభియోగాలన్నీ తప్పని ఆయన కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో మనీష్ కు కోర్టు కండిషనల్ బెయిల్ ను మంజూరు చేసింది. గతంలో ప్రాక్టీస్ చేసిన ఆసుపత్రికి వెళ్లరాదని, అక్కడి ఉద్యోగులను, పేషెంట్స్ ను కలవరాదని కండిషన్ పెట్టింది. 

  • Loading...

More Telugu News