: 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.. వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమే: మంత్రి జవహర్


నంద్యాల ఉప ఎన్నిక ఫలితంతో డీలా పడ్డ వైసీపీ శ్రేణులు... కాకినాడ ఫలితాలతో సైలెంట్ అయిపోయాయి. ఇదే సమయంలో ఫుల్ జోష్ లో ఉన్న టీడీపీ నేతలు వైసీపీ అధినేత జగన్ పై విమర్శలకు పదును పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో, మంత్రి జవహర్ ఈ విషయంపై స్పందించారు. 20 నుంచి 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ అయన బాంబు పేల్చారు. మిగిలిన వారు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారని చెప్పారు. చివరకు వైసీపీలో మిగిలేది జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు.

 క్రైస్తవులు, ముస్లింలంతా వైసీపీ వెనుకే ఉన్నారంటూ జగన్ పదేపదే చెప్పారని... వైసీపీకి అంత సీన్ లేదనే విషయం నంద్యాల ఎన్నికతో తేలిపోయిందని అన్నారు. శిల్పా సోదరులను జగన్ బలి పశువును చేశారని చెప్పారు. కొడాలి నాని అవాకులు, చవాకులు పేలుతున్నారని... అంత దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఓ సామాన్యుడిని కొడాలి నానిపై పోటీకి పెట్టి గెలిపిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News