: దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ రెండోసారి నోటీసులు


త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామితో ఇటీవ‌లే ప‌న్నీర్ సెల్వం చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోన్న టీటీవీ దినకరన్ మద్దతుదారులైన 19 మంది ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర‌ అసెంబ్లీ స్పీకర్ నోటీసులిచ్చారు. ఇటీవ‌లే ఈ 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి తాము మద్దతు ఉపసంహరించుకుంటున్నామని గవర్నర్ విద్యాసాగర్‌రావుకు మెమొరాండం కూడా ఇచ్చారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ప‌ళ‌నిస్వామి అభ్యర్థనపై ఈ 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులివ్వడం ఇది రెండోసారి. తిరుగుబాటు ఎమ్మెల్యేల వైఖరి ఏమిటో ఈ నెల‌ 5లోగా వివరణ ఇవ్వాలని స్పీక‌ర్ సూచించారు. ప్ర‌స్తుతం ఆ 19 మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉంటున్న‌ట్లు స‌మాచారం. 

  • Loading...

More Telugu News