: అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్


అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ హైదరాబాదులోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన జడ్జి తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, హైకోర్టులో కూడా జగన్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలన్న జగన్ కోరికను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. 

  • Loading...

More Telugu News