: నన్ను ఉరితీయండి.. నాకు బ‌త‌కాల‌ని లేదు: గుర్మీత్ బాబా


అత్యాచారం కేసులో జైలు శిక్ష ఎదుర్కుంటున్న డేరా స‌చ్చా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్ ర‌హీమ్ సింగ్ జైలులో తెగ బాధ‌ప‌డిపోతున్నాడు. వేరే కేసులో శిక్ష అనుభ‌విస్తూ గుర్మీత్ సింగ్ ఉన్న జైలులోనే ఉన్న ఓ ఖైదీ తాజాగా బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... జైలుకి వచ్చిన రోజు రాత్రంతా నిద్ర‌పోకుండా తాను చేసిన త‌ప్పేంట‌ని, ఈ శిక్ష ఎందుకు విధించారు దేవుడా? అని గుర్మీత్ సింగ్‌ బాధ‌ప‌డిపోయాడ‌ని చెప్పాడు. అంతేగాక‌, త‌న‌ను ఉరితీయాల‌ని, త‌న‌కు బ‌త‌కాల‌ని లేద‌ని గుర్మీత్ బాబా వేడుకున్నాడ‌ని తెలిపాడు.

అలాగే, గుర్మీత్ బాబాని జైల్లో మిగతా ఖైదీల్లాగే చూస్తున్నార‌ని, ఆయ‌న‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమీ లేద‌ని ఆ ఖైదీ చెప్పాడు. కాగా, ఇద్ద‌రు సాద్వీల‌పై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ బాబాకు హ‌ర్యానాలోని పంచ‌కుల సీబీఐ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, 15 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే. 

  • Loading...

More Telugu News